ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోను ఆర్డర్ చేసిన ఓ యువకుడు రెండు సార్లు మోసపోయాడు. మొదటి డెలివరీ సమయంలో కస్టమర్ సమక్షంలో డెలివరీ బాయ్ ప్యాకెట్‌ను ఓపెన్ చేయగా, అందులో కొత్త ల్యాప్‌టాప్ బదులు పాత ల్యాప్‌టాప్ ఉండటం గమనించారు. వెంటనే రిటర్న్ చేసి తిరిగి కొత్త యూనిట్ కోసం ఎదురు చూశారు.
అయితే రెండోసారి వచ్చిన ల్యాప్‌టాప్ కూడా పాతదే కావడంతో బాధితుడు తీవ్రంగా నిరాశ చెందాడు. వరుసగా రెండు సార్లు ఇలా మోసపోవడంతో అతను ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేలాది రూపాయల విలువ చేసే ఉత్పత్తుల్లో ఇటువంటి తప్పుడు సరఫరాలు వినియోగదారుల్లో భయానక పరిస్థితులు కలిగిస్తున్నాయని సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా స్పందించాల్సి ఉంది.
Read More : ఢిల్లీ షాబాద్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.
