జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సమీక్ష సమావేశం జరిగింది. బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ హాల్ సమీపంలోని సాగరిక హాల్లో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ –
‘‘ప్రపంచం మనవైపు తిరిగి చూసేలా ఈ యోగా దినోత్సవాన్ని ఎంతో విశిష్టంగా నిర్వహించాలి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రజల సంబురంగా జరగాలి. అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి’’ అన్నారు. ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేసేదని చెప్పారు.
సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు:
- సూరత్లో నిర్వహించిన యోగా వేడుకలను అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతుల్లో విశాఖలో అమలు చేయాలని అధికారులకు సూచించారు.
- ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహన సదుపాయాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- ప్రజలు 600 మీటర్ల కన్నా ఎక్కువ నడవకుండా చూసేందుకు వాహన వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
- జియో, ఎయిర్‌టెల్ వంటి నెట్‌వర్క్‌ల కెపాసిటీ పెంచేందుకు టెలికాం కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
- ప్రజలకు తాగునీరు, వైద్య సదుపాయాలు, టాయిలెట్లు, అత్యవసర సాయంతో సహా అన్ని వసతులు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు కలసి ఈ చారిత్రక వేడుకను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కమిట్‌మెంట్‌తో, బాధ్యతతో పని చేయాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Read More : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్

2 thoughts on “విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం – Minister”
Comments are closed.