దేశవ్యాప్తంగా దుమారం రేపిన ‘హనీమూన్ మర్డర్’ కేసులో తాజా పరిణామాలు వెలుగుచూశాయి. మేఘాలయకు హనీమూన్ ట్రిప్ కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసులో, ఆయన భార్య సోనమ్ రఘువంశీ కీలక నిందితురాలిగా తేలింది. భర్తను తన ప్రియుడితో కలిసి కిరాయి హంతకుల చేత హత్య చేయించిందనే ఆరోపణలపై ప్రస్తుతం సోనమ్ పోలీసుల అదుపులో ఉంది.
ఈ నేపథ్యంలో సోనమ్‌ను అరెస్టు చేసిన స్థలం – మేఘాలయలోని ఓ దాబా వద్ద – ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారింది. అదే దాబా యజమాని సాహిల్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
“నిన్న రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో సోనమ్ మా దాబా వద్దకు ఒక్కరే వచ్చింది. ఆమె తీవ్ర మనోవేదనతో ఏడుస్తూ కనిపించింది. ఇంటికి ఫోన్ చేయాలంటూ అడిగింది. నా ఫోన్ ఇచ్చాను. ఆ కాల్ చేసిన తర్వాత ఆమెను కూర్చోమని చెప్పి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారు కొద్ది నిమిషాల్లోనే వచ్చి ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు,” అని సాహిల్ వివరించాడు.
ఈ వివరాలు కేసులో కీలక ఆధారంగా మారే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోనమ్‌ను విచారించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ హత్యలో ఆమె ప్రియుడు పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Read More : మేఘాలయ హనీమూన్ హత్యకేసులో రాజా తల్లి సంచలన ఆరోపణలు.

2 thoughts on “‘హనీమూన్ మర్డర్’ కేసులో మరో కీలక మలుపు”
Comments are closed.