ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ “మన ఊరు – మాటా మంతి”

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. “మన ఊరు – మాటా మంతి” పేరుతో ఆయన మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్తులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖాముఖి సంభాషణ నిర్వహించారు.

ఈ కార్యక్రమం టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించగా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకుని, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాల్గొన్న గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం దొరికినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

Read More : ఒంటరి వృద్ధులపై పెళ్లిళ్ల పేరిట మోసం