హైడ్రా సంస్థలో 200 డ్రైవర్ ఉద్యోగాలు.

హైడ్రా సంస్థ డ్రైవర్ ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది యువకులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 200 డ్రైవర్ పోస్టుల భర్తీకి సంస్థ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఈ దరఖాస్తులు సోమవారం నుంచి రెండు రోజులు స్వీకరించనున్నట్లు హైడ్రా సంస్థ ప్రకటించింది.

ఈ ఉద్యోగాలకు ప్రత్యేక నిబంధనగా, 2022-23 పోలీస్ కానిస్టేబుల్ నియామకంలో స్వల్ప తేడాతో ఎంపిక కాకపోయిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల ప్రకారం పేర్లు ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తున్నారు.

దీంతో, రాష్ట్రం అంతటినుండి అర్హులైన యువకులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకొని దరఖాస్తు కేంద్రాల వద్ద భారీ కూర్పు ఏర్పరచారు. ఈ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగనున్నది. ఎంపికైన అభ్యర్థులు హైడ్రా సంస్థలో డ్రైవర్‌గా పని చేయనున్నారు.

Read More : ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గొప్ప ఆలోచన.

One thought on “హైడ్రా సంస్థలో 200 డ్రైవర్ ఉద్యోగాలు.

Comments are closed.