గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, జీవీఎంసీలో తాము మెజారిటీతో ఉన్నామని స్పష్టం చేశారు.
డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపికలో ఆలస్యం కావడానికి కారణం ఉందని తెలిపారు. “డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి ఇవ్వాలని గత రాత్రి 11 గంటలకు నిర్ణయించాం. అయితే, టీడీపీలో కూడా కొంతమంది ఆశావాహులు ఉన్నారు. ఈ విషయాన్ని ముందుగానే సమన్వయం చేయాల్సి ఉండేది. అదే ఆలస్యానికి కారణం” అని వివరించారు.
ఈ ఎన్నిక వాయిదా పడటానికి కోఆర్డినేషన్ లోపం కూడా కారణమైందని పల్లా పేర్కొన్నారు. జీవీఎంసీ కౌన్సిల్‌కు తమ పార్టీయేతర సభ్యులు హాజరయ్యే విషయంలో పూర్తి ధీమా ఉందని చెప్పారు. “దీనికి నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను” అని హామీ ఇచ్చారు.
Read More : ఏపీ లిక్కర్ స్కాం: కసిరెడ్డి పిటీషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్

One thought on “GVMCలో మా వద్ద పూర్తి మెజారిటీ ఉంది.”
Comments are closed.