హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో భవనంలో 53 మంది ఉన్నారు.

మంటలు భవనం మెట్ల ప్రాంతంలో మొదలుకావడంతో లోపలున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తప్పించుకునేందుకు వీరంతా టెర్రస్‌పైకి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది… తక్షణ చర్యలతో వారందరినీ సురక్షితంగా రక్షించారు. భారీ ప్రమాదం తలపడినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఫైర్ సిబ్బంది అప్రమత్తత కారణంగా 53 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.

ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. భవనంలో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది.

Read More : దేశాలకు ఎంపీల బృందాలు

One thought on “హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

Comments are closed.