లింగంపల్లి నుండి శంషాబాద్‌ విమానాశ్రయానికి పుష్పక్ బస్సులు ప్రారంభం

పుష్పక్ బస్సులు: లింగంపల్లి నుండి శంషాబాద్‌ విమానాశ్రయానికి

హైదరాబాద్: కూకట్‌పల్లి ఆర్టీసీ డివిజన్ పరిధిలో లింగంపల్లి నుంచి ఎన్‌జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ప్రవేశపెట్టినట్టు డిప్యూటీ ఆర్‌ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 216/300 నెంబర్‌లతో ఆపరేట్ అవుతాయని ఆమె తెలిపారు.

ఇందులో భాగంగా, లింగంపల్లి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి కొత్తగా పుష్పక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ బస్సులు లింగంపల్లి నుంచి ఆల్విన్‌క్రాస్‌ రోడ్డు, హఫీజ్‌పేట్, గచ్చిబౌలి మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటాయి.

లింగంపల్లి నుండి విమానాశ్రయానికి రూ. 300 చార్జి ఉండటం, మొదటి బస్సు ఉదయం 5.45 గంటలకు, చివరి బస్సు 8.45 గంటలకు ఉంటుందని ఆమె తెలిపారు.