చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న తిరుమల డిపో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు, చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ప్రమాదం పౌర్ణమి సందర్భంగా తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లే భక్తులు ఎక్కువగా ప్రయాణించే సమయానికి సంభవించింది. ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుండి తిరుపతికి వెళ్ళే ఆర్టీసీ బస్సు అగరాల సమీపంలో ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

Read More : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం