రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎంతగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, వేగం కోసం ప్రాణాలను త్యాగం చేయడమే కేసుల మిగిలిపోతోంది. తాజాగా బాపట్ల జిల్లాలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.
శనివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతులను పాలపర్తి శ్రీను (25), తాళ్లూరి ప్రభుదాస్ (37), తమ్ములూరి సురేంద్ర (26)గా పోలీసులు గుర్తించారు.
లారీ మార్టూరు నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేగమే మృత్యువుకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read More : మురళీ నాయక్ వీరమరణంపై ఫార్మర్ సీఎం పరామర్శ

One thought on “బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం”
Comments are closed.