సిబ్బందికి కొత్త వాహనాలు అందించిన సీఎం

హైదరాబాద్‌ నగర భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. నూతనంగా నిర్మించిన హైద్రాబాద్ హైడ్రా స్టేషన్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా hydra బలగాలకు అత్యాధునిక వాహనాలు అందజేశారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 80కి పైగా కొత్త వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 55 స్కార్పియో వాహనాలు, 21 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కార్లు, ట్రూప్ క్యారియర్ వ్యానులు మరియు పలు బైకులు హైడ్రా సేవలోకి తీసుకొచ్చారు.

హైడ్రా భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా ఉండేలా, వాటి స్పందన వేగాన్ని పెంచేలా ఈ వాహనాల అందజేత ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంటున్నారు అధికారులు. భవిష్యత్తులో ప్రజల రక్షణకు, హైదరాబాదును సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఇది సరైన దిశగా తీసిన అడుగని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : పేదలకోసం మెరుగైన వైద్యసేవల దిశగా మరో అడుగు

One thought on “సిబ్బందికి కొత్త వాహనాలు అందించిన సీఎం

Comments are closed.