కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు..

కర్ణాటకలోని కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “నాకు ఒక సూసైడ్ బాంబ్ ఇవ్వండి… దానిని ఒంటికి కట్టుకుని వెళ్లి పాకిస్తాన్‌పై దాడి చేస్తా” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జమీర్ అహ్మద్ మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. దేశం మీద యుద్ధం వస్తే నేను ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నా. మోదీ గారు, అమిత్ షా గారు ఒక బాంబ్ ఇస్తే నేను దానిని ధరించి పాకిస్తాన్ మీద దాడికి వెళ్లిపోతాను” అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జమీర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read More : పాకిస్థాన్ : మాల్‌వేర్ పీడీఎఫ్ ఫైళ్లతో హ్యాకింగ్

One thought on “కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు..

Comments are closed.