తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఫలితాలను విడుదల చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 98.2 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు 98.7 శాతం విజయ శాతం సాధించాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉత్తీర్ణత శాతాల్లో ఒకటి.
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లో చూసుకోవచ్చు.
ఈ ఏడాది ఫలితాల మెమోల్లో ముఖ్యమైన మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు గ్రేడ్‌లు, సీజీపీఏలే ఇవ్వగా.. ఈసారి నుంచి రాత పరీక్ష, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు విడిగా చూపిస్తూ, మొత్తం మార్కులు, గ్రేడ్‌లు మెమోలో అందించనున్నారు. విద్యార్థి కనీస మార్కులు సాధిస్తే ‘పాస్’, లేకపోతే ‘ఫెయిల్’ అని స్పష్టంగా మెమోలో నమోదు చేస్తారు.
ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
Read More : తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 పరీక్షపై విచారణ

One thought on “TG – ఉత్తీర్ణత శాతం 98.2%”
Comments are closed.