రామాయణ సినిమా: బీటౌన్‌లో భారీ అంచనాలు!

Bollywood Ramayana Movie

బాలీవుడ్‌లో ‘రామాయణ’ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిపోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానున్నది. మొదటి భాగం 2026 దీపావళి కానుకగా, రెండో భాగం 2027 దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, లారా దత్తా కైకేయిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లుగా రణ్ బీర్ కపూర్ ఇటీవల వెల్లడించారు, అయితే పార్ట్ 2 షూటింగ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అందలేదు.

ఇటీవల, అశోక వనం ఎపిసోడ్స్ చిత్రీకరించే సెట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సెట్‌లో బ్లూ కర్టైన్స్, బ్యాగ్రౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించే వీఎఫ్ ఎక్స్ టెక్నాలజీ కనిపిస్తోన్నది. నెటిజన్లు ఈ సెట్ పై అభినందనలు తెలుపుతున్నారు, ఇది సినిమా విజువల్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇతర రామాయణ చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉండబోతుందని ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని నెవ్వర్ బిఫోర్ లా రూపొందించడంతో, దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More




One thought on “రామాయణ సినిమా: బీటౌన్‌లో భారీ అంచనాలు!

Comments are closed.