ప్రియదర్శి పులికొండ: స్టార్ దంపతుల నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్

Priyadarshi Pulikonda Tollywood Actor

ప్రియదర్శి పులికొండ తన కెరీర్లో కీలకమైన అడుగులు వేస్తూ, హీరోగా కూడా మంచి గుర్తింపు పొందుతున్నాడు. వరుసగా విజయాలు సాధిస్తున్న ప్రియదర్శి, ఇటీవల ‘కోర్టు’ సినిమాలో నటనతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ‘కోర్టు’ సినిమాతో సూపర్ హిట్ సాధించిన ప్రియదర్శి, తాజాగా ‘సారంగ పాణి జాతకం’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా విడుదలైంది. ప్రియదర్శి నటనను పలువురు ప్రముఖులు మెచ్చుకుంటున్నారు.

తాజాగా, ఈ సినిమాలో ప్రియదర్శి నటనను చూసిన కోలీవుడ్ స్టార్ దంపతులు సూర్య మరియు జ్యోతిక అతన్ని ప్రశంసిస్తూ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఫ్లవర్ బొకే తో పాటు ఒక చిన్న లెటర్‌ను ప్రియదర్శికి పంపిన ఈ లవ్లీ కపుల్, అతని నటనను అభినందించారు.

ప్రియదర్శి, ఈ ప్రత్యేక గిఫ్ట్‌ను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని, “మీరు పంపిన ప్రేమ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది” అని తెలిపాడు. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను” అని ఎక్స్‌ప్రెస్ చేసిన ప్రియదర్శి, సూర్య-జ్యోతికలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Read More


One thought on “ప్రియదర్శి పులికొండ: స్టార్ దంపతుల నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్

Comments are closed.