తిరుమలలో చిరుతల సంచారం మరింత పెరిగింది. రెండు వారాల క్రితం కూడా తిరుమల పరిసరాలలో చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పరిస్థితి క్రమంగా భక్తులలో భయం రేకెత్తించింది. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
భక్తుల రక్షణ కోసం తిరుమల తితిదే (టీటీడీ) అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయం సమీపంలో చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడ చిరుత చిక్కింది, దీంతో ఆందోళనకు గురైన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక తాజాగా మరోసారి చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. జూపార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేటు వద్దకు చేరుకున్న చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. ఈ సంగతిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.
ఇప్పటికే, చిరుతల పర్యవేక్షణ కోసం ఏపీ అటవీ శాఖ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. శాటిలైట్, అధునాతన కెమెరాలు, జీపీఎస్ వంటి టెక్నాలజీలతో చిరుతలను క్రమంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక సెల్ అటవీ మ్యూజియం భవనంలో ఏర్పాటు చేయనున్నారు.

One thought on “తిరుమలలో భక్తుల భయంతో కొత్త చర్యలు..”
Comments are closed.