జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండించారు. దాదాపు 28 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు పోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలపగా, బాధితుల పక్కన నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఈ ఘటనను నిరసిస్తూ, గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఓ క్యాండిల్ ర్యాలీని చేపట్టనున్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.
Read More : పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు సీఎం ట్రిబ్యూట్

One thought on “28 మంది పర్యాటకుల మృతి, సీఎం నిరసన”
Comments are closed.