తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అఘోరీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇదే కాకుండా, అఘోరీ తన వ్యాఖ్యలతో కూడా వివాదాల్లో ఇరుక్కొంటున్నాడు. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అసభ్య, అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అఘోరీ వ్యాఖ్యలు సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తున్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దళితుల అభిమానం దెబ్బతినిన నేపథ్యంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More : తెలంగాణలో TDP ఎమ్మెల్యేకు భారీ షాక్!

2 thoughts on “అఘోరీపై దళిత సంఘాల ఫిర్యాదు…”
Comments are closed.