విశాఖ నగరంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 23 ఏళ్ల శ్రీరామ్ స్లిప్స్ పెట్టి సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుండగా, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో అవమానపడిన శ్రీరామ్, కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖపట్నం జిల్లా భీమిలి సంగివలసకు చెందిన శ్రీరామ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై అతని మృతికి వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసులు ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని కాలేజీ మార్చురీలో ఉంచి, అవసరమైన పరిశీలన కొనసాగిస్తున్నారు.
Read More : అఘోరీపై దళిత సంఘాల ఫిర్యాదు…
