ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈరోజు పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఎర్నాకులం పీఎస్‌కు వెళ్లారు. ఇటీవల ఓ హోటల్‌పై ‘నార్కోటిక్స్’ రైడ్ జరిగిన సమయంలో ఆయన అక్కడి నుంచి పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగంపై చాకోను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
అయితే, పోలీసులు అక్కడికి రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు చాకోపై నటి విన్సీ అలోషియస్ ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అమ్మ లో ఫిర్యాదు కూడా చేశారు.
Read More : జర్మన్ అమ్మాయితో మలయాళ స్టార్ వారసుడి లవ్ స్టోరీ!

One thought on “డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో”
Comments are closed.