జర్మన్ అమ్మాయితో మలయాళ స్టార్ వారసుడి లవ్ స్టోరీ!

Pranav Mohanlal German Girlfriend

సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ సినీ ప్రపంచంలో విభిన్నమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి లాంటి స్టార్‌డమ్‌ను అందుకోవడం, ఇండస్ట్రీని ఏలడం అతడి లక్ష్యం కాదు. అతడు జీవితం పట్ల సింపుల్‌ యాటిట్యూడ్‌తో ఉన్నాడు. సినిమాలు మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమ, సంగీతం, ప్రయాణం వంటి విభిన్న రంగాల్లో తన ఆసక్తిని ప్రదర్శిస్తూ ప్రత్యేకమైన ముద్ర వేస్తున్నాడు.

ఇండస్ట్రీలో అనేక స్టార్ వారసులు తమ తండ్రుల విజయాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటే, ప్రణవ్ మాత్రం ఒత్తిళ్లకు దూరంగా, తనకు నచ్చిన జీవితాన్ని గడపాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే గెస్ట్ పాత్రలతో సినిమాలలో కనిపిస్తూ, పూర్తిస్థాయి హీరోగా మారాలన్న ఆవేశం అతడిలో కనిపించదు.

ఇటీవల ప్రణవ్ కళ్యాణి ప్రియదర్శన్‌తో ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే ఫిలింమేకర్ అలెప్పీ అష్రాఫ్ ఈ వార్తలను ఖండిస్తూ, వారు అన్నా-చెల్లెళ్లలా ఉంటారని స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని తెలిపారు.

తాజాగా మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రణవ్ మోహన్‌లాల్ ప్రస్తుతం ఓ జర్మనీ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రణవ్ వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తూ, తనకు నచ్చిన దారిలో ప్రయాణిస్తూ అభిమానులకు ఆసక్తికరమైన అంశాలు అందించడంలో మాత్రం వెనుకపడడం లేదు.

Read More


One thought on “జర్మన్ అమ్మాయితో మలయాళ స్టార్ వారసుడి లవ్ స్టోరీ!

Comments are closed.