లెజెండరీ నటుడు కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కలయికలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. క్లాసిక్‌గా నిలిచిన ‘నాయకన్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న రెండో సినిమా ఇది. మణిరత్నం విజనరీ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ సంగీతం, కమల్ హాసన్ మేనరిజం – ఇవన్నీ కలిసొచ్చిన ఈ చిత్రం గ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాలో మలయాళం, హిందీ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. ‘థగ్ లైఫ్’ ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఇటీవల జరిగిన FICCI ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, “ఇది మల్టీ-స్టారర్ సినిమా. ఇందులోని కొంతమంది భవిష్యత్తులో పెద్ద స్టార్స్ అవుతారు. మణిరత్నం ఇలాంటి సినిమా చేయాలనుకున్నారు, నాకు కూడా అలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఉంది. అందుకే మేమిద్దరం కలిసి చేస్తున్నాం” అని తెలిపారు.
ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు సిలంబరసన్ TR, త్రిష, నాజర్, అభిరామి, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, వైయాపురి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మెహేంద్రన్, శివ ఆనంత్ కలిసి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2025 జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

One thought on “కమల్ హాసన్, మణిరత్నం ‘థగ్ లైఫ్’ – ప్రతిష్టాత్మక సినిమా!”
Comments are closed.