ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో హృదయాన్ని కలిచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం 11 ఏళ్ల మూగ-చెవిటి బాలికపై ఓ దుండగుడు పాశవికంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటన పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే — బాలికను తన గ్రామ సమీపంలోని పొలాలకు తీసుకెళ్లిన నిందితుడు అత్యంత అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాడి అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన బాలికను బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆమె పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు, ముఖంపై తీవ్రంగా కొట్టిన గాయాలు, శరీరంపై పంటిగాట్లు, అలాగే ప్రైవేట్ పార్ట్స్ పై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు ఉన్నట్లు తెలిపారు. ఈ దృశ్యాలు చూసిన వెంటనే గ్యాంగ్‌రేప్ అయి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, బాలిక చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్న ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయబోయే సమయంలో అతడు పోలీసులపై తుపాకీతో కాల్పులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆత్మరక్షణలో పోలీసులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ నిందితుడి కాలులోకి దూసుకెళ్లింది.
అతడిని డాన్ సింగ్ (24)గా పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటనపై ముగ్గురు ప్రత్యేక బృందాలతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్లు రాంపూర్ పోలీసులు తెలిపారు. బాధిత చిన్నారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతను సృష్టించడంతో, బాధిత చిన్నారికి న్యాయం జరగాలని, నిందితుడికి కఠినమైన శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : మీరట్‌లో దారుణం: భర్తను హత్య చేసి పాము కాటుగా నాటకం ఆడిన భార్య!

One thought on “ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో మూగ-చెవిటి బాలికపై దారుణ అత్యాచారం…”
Comments are closed.