బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునే ప్రస్తుతం ఓ భారీ విలువైన ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ముంబైలో సముద్రం ఒడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రాంతంలో వీరు కొత్త ఇంటిని ఎంపిక చేసుకున్నారు. ఈ క్వాడ్రాప్లెక్స్ అపార్ట్‌మెంట్ విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 16వ అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు విస్తరించిన ఈ అపార్ట్‌మెంట్ నుంచి అందమైన సముద్ర దృశ్యాన్ని వీక్షించొచ్చు.
ఇంతకముందు వీరు 2021లో దాదాపు రూ.25 కోట్లకు ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం వీరికి పాప పుట్టడంతో, పెద్దదైన విలాసవంతమైన ఇంటి అవసరం ఏర్పడింది. అందుకే ఈ కొత్త ఇంటిని ఎన్నుకున్నారు. దీపికా, రణ్ వీర్ లు లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి ప్రాధాన్యం ఇచ్చే వారిగా బాలీవుడ్‌లో గొప్ప గుర్తింపును పొందారు.
ఈ అపార్ట్‌మెంట్‌లో ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ప్రత్యేకంగా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ కూడా ఇటీవల మన్నత్ రిపేర్ పనుల కోసం ఇక్కడ తాత్కాలికంగా ఉంటోంది. అలాగే సల్మాన్ ఖాన్‌కి కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఓ ప్లాట్ ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం దీపికా పదుకునే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో కలసి ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటిస్తోంది. తన సినీ ప్రాజెక్టులతో పాటు, వ్యక్తిగత జీవితంలో కూడా మంచి స్థాయిలో ముందుకెళ్తున్న ఈ స్టార్ కపుల్, కొత్త ఇంటితో తమ కొత్త జీవనప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

One thought on “రూ.100 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసిన రణ్ వీర్-దీపికా”
Comments are closed.