తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ పేరును ఉద్దేశపూర్వకంగా ఏకవచనంలో ప్రస్తావించారు.
‘‘ఏయ్ బీజేపీ మోదీ… మా పార్టీ బ్రిటిష్ వాళ్లకూ భయపడలేదు, మీలాంటి వారికీ భయపడే ప్రశ్నే లేద’’ అంటూ ధీటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని స్వాతంత్ర్య పోరాట ఘట్టాన్ని గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ఇటీవల మోదీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాల పట్ల కూడా కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ దొంగల బృందం — మోదీ, అమిత్ షా కేడీలు — స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను రాజకీయంగా వేధించడం దారుణం’’ అంటూ మండిపడ్డారు.
అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విమర్శలపై బీజేపీ ఎలా స్పందించనుందో అన్న ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
Read More : ప్రధాని మోడీ భయంతోనే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శ
