జూన్‌లో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. బాలయ్య ప్రతి బర్త్‌డేకు ఫ్యాన్స్‌కు ప్రత్యేక ట్రీట్ ఇస్తాడని తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్లు, టీజర్లు లేదా కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు విడుదల చేస్తూ అభిమానులను ఉత్సాహంలో ముంచెస్తుంటాడు. ఈసారి కూడా బాలయ్య బర్త్‌డే (జూన్ 10) సందర్భంగా భారీ సర్‌ప్రైజ్‌ల కోసం సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్నాడు. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. బాలయ్య బర్త్‌డేకు ‘అఖండ 2’ టీజర్ విడుదల చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యాడు. టీజర్ కోసం ప్రత్యేకంగా విజువల్స్ చిత్రీకరించి సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
ఈ టీజర్‌ను పాన్ ఇండియా స్థాయిలో డిజైన్ చేస్తున్నారని సమాచారం. విడుదల కాగానే టీజర్‌తో దేశవ్యాప్తంగా సినిమాకు మాస్ బజ్ రావాలని బోయపాటి లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాలయ్య అభిమానులకు ఇది ఓ మిలేట్రీ లెవల్ ట్రీట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
అఖండ 2 టీజర్‌తో పాటు, బాలయ్య–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చే కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బాలయ్య బర్త్‌డే రోజునే రానుందని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇవి కాకుండా మరికొన్ని అదనపు అప్డేట్స్ కూడా రావొచ్చని చెబుతున్నారు.
