గ్లోబల్ లీడర్స్ అవార్డు వరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డు ఆయనను వరించింది. వివిధ రంగాల్లో సామాజిక అభివృద్ధికి, ప్రపంచ స్థితిగతులలో మార్పునకు విశేషంగా కృషి చేసిన 40 ఏళ్ల లోపు యువ నాయకులకు ఈ గౌరవాన్ని అందజేస్తారు.

ఈ ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా, ఆ జాబితాలో భారతదేశం నుంచి ఏడుగురికి చోటు దక్కింది. వారిలో తెలుగుదేశం నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ప్రభుత్వ పాలన, ప్రజాసేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసిన నాయుడుకు ఈ గుర్తింపు అందడం గర్వకారణంగా మారింది. రాజకీయ రంగంతో పాటు సామాజిక సేవలలోనూ ఆయన తీసుకున్న ముందడుగులు ఈ అవార్డుకు మద్దతుగా నిలిచినట్లు ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ సంస్థ పేర్కొంది.

Read More : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుకు ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్