రజనీ గ్రేస్‌తో రెట్రో ప్రీ రిలీజ్ గ్రాండ్‌గా!

Retro movie pre-release event

కోలీవుడ్‌ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపుతున్న సినిమాల్లో సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రెట్రో’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. మే 1న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి విభిన్న కథ, మేకింగ్ స్టైల్‌తో పాటు సూర్య-కార్తీక్ కాంబినేషన్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత చిత్రం ‘కంగువా’ ఫలితంతో మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా, రెట్రోపై మళ్లీ హైప్ పెరిగింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 18న చెన్నైలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం చిత్రానికి అదనపు ఆకర్షణగా మారింది. కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ ‘పేట’ సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, రజనీకాంత్-కార్తీక్ కాంబో మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్‌ ద్వారా నిర్మించాడు. బడ్జెట్ పరంగా గత చిత్రాల కన్నా తక్కువగానే అయినా, ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది. థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో రూ.75 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధ్యమని విశ్లేషకుల అభిప్రాయం. రజనీ ప్రెజెన్స్‌తో రెట్రోకి మరింత బజ్ ఏర్పడుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Read More

One thought on “రజనీ గ్రేస్‌తో రెట్రో ప్రీ రిలీజ్ గ్రాండ్‌గా!

Comments are closed.