విశ్వంభరపై క్లారిటీ వచ్చేసింది – రిలీజ్ డేట్ ఫిక్స్!

Vishwambhara release date

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదల తేదీ ఖరారైందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సీజీ వర్క్ ఆలస్యమవుతున్న కారణంగా సినిమాను విడుదల చేయడం వాయిదా పడింది. దీంతో విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటంతో అభిమానులు తీవ్ర నిరీక్షణలో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం, జూలై 24న విశ్వంభరను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తేదీకి ఓ ప్రత్యేకత కూడా ఉంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత విజయవంతమైన సినిమాల్లో ఒకటైన ఇంద్ర సినిమా అదే తేదీన విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ సెంటిమెంట్‌ను నమ్ముతూ మేకర్స్ ఈ విడుదల ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు టాక్.

విడుదల తేదీ ఖరారవడంతో ప్రచార కార్యక్రమాలు కూడా షురూ కానున్నాయి. ఏప్రిల్ 12 నుంచి ప్రమోషన్ మొదలవుతుందనీ, తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. రాముడిపై సాగే ఈ భక్తిగీతం ద్వారా ప్రమోషన్‌కి గ్రాండ్ బిగినింగ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ తర్వాత టీజర్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు. సైరా నరసింహారెడ్డి తరహాలో అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

Read More

One thought on “విశ్వంభరపై క్లారిటీ వచ్చేసింది – రిలీజ్ డేట్ ఫిక్స్!

Comments are closed.