“వారి కోసం దేవుడిని ప్రార్థిస్తా” – ట్రోల్స్‌పై రెహమాన్ కౌంటర్

AR Rahman divorce and personal life

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన వైవాహిక జీవితం ముగింపు దశకు చేరిన సమయంలో విమర్శలతో పాటు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు. ఈ వయసులో విడాకులు ఎందుకని ప్రశ్నించినవారితో పాటు, ఆయనపై వివిధ రకాల ఊహాగానాలు చేసినవారు కూడా ఉన్నారు. అయితే రెహమాన్ వాటిని పట్టించుకోకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, సెలబ్రెటీలు విమర్శలు ఎదుర్కొనడం సహజమని, వారందరికీ కుటుంబం ఉంటుందని గుర్తించి, ఎవరిపైనా తాను తప్పుగా మాట్లాడరని స్పష్టం చేశాడు. తనపై తప్పుగా విమర్శించిన వారిని సరైన మార్గంలో నడిపించమని దేవుని ప్రార్థిస్తానని వెల్లడించాడు.

వైవాహిక జీవితంలో అనూహ్యంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, 30 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి రావడం బాధాకరమేనని చెప్పుకొచ్చాడు. తాము కలిసి ముందుకు సాగలేమని స్పష్టంగా తెలిసిన తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు గోప్యతను అంగీకరించి, సహకరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపాడు.

ప్రస్తుతం రెహమాన్ బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’కు సంగీతం అందిస్తుండగా, ధనుష్ సినిమాలో కూడా పని చేస్తున్నట్టు సమాచారం. వైవాహిక జీవితం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, సంగీత ప్రయాణంలో మాత్రం రెహమాన్ స్థిరంగా ముందుకు సాగుతున్నాడు.

Read More

One thought on ““వారి కోసం దేవుడిని ప్రార్థిస్తా” – ట్రోల్స్‌పై రెహమాన్ కౌంటర్

Comments are closed.