ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఊపేస్తున్న అంశాల్లో ఏఐ టెక్నాలజీ ఒకటి. నటీనటుల లుక్స్, వాయిస్, హావభావాలను ఏఐ సాయంతో అద్భుతంగా మిక్స్ చేస్తూ అనేక షార్ట్ వీడియోలు రూపొందిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్దీ’ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్‌ను తీసుకుని ఓ నెటిజన్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్న వీడియోతో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మార్చారు. నిజమైన దృశ్యంలా అనిపించేలా రూపొందించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ‘పెద్ది’ గ్లింప్స్‌లో చరణ్ చెప్పిన “ఒటే పని సేసేనాకి… ఒకే నాగ బతికేనాకి ఇంత పెద్ద బతుకెందుకు?” అనే డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ డైలాగ్‌ను ఆధారంగా చేసుకుని చేసిన ఈ ఏఐ వీడియోను చూసినవారంతా నిజమేనా? అనిపించేంత నేచురల్‌గా ఉందని అంటున్నారు. కొద్ది గంటల్లోనే లక్షకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో షేర్లు వచ్చాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ ఆట కూలీ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రంగస్థలం తరహాలో రా కంటెంట్‌తో ఈ సినిమా సాగనుండగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మార్చి 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
AI Mass 🔥🔥#PEDDI pic.twitter.com/KOK3QOzAUW
— Mr© 🔥 (@CharanTheLEO) April 8, 2025

One thought on “చరణ్ పెద్ది డైలాగ్‌కు ఏఐ టచ్: నెటిజన్లు షాక్!”
Comments are closed.