వనపర్తిలో పసిబిడ్డ మృతి : ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం పై తీవ్ర ఆరోపణలు

వనపర్తి జిల్లాలోని అమరచింత మండల కేంద్రంలో జ‌రిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. చంద్రఘడ్ గ్రామానికి చెందిన గర్భిణి అనిత సోమవారం అర్థరాత్రి పురిటి నొప్పులతో అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి చేరగా, డాక్టర్లు లేరన్న కారణంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

అనితకు సాధారణ డెలివరీ చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించగా, బిడ్డ తల బయటకు రాకపోవడంతో సమస్య తలెత్తింది. ఆ తర్వాత ఆమెను ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అక్కడి వైద్యులు కూడా సమర్థవంతంగా స్పందించలేకపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

తల్లి ప్రాణాలు నిలబెట్టేందుకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని, అందులో భాగంగా శిశువు తల, శరీరాన్ని విడదీసి బయటకు తీయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతిచెందిందని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు.

Read More : నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీస్ వాహనంతో రీల్స్ తీయడంపై కలకలం.

One thought on “వనపర్తిలో పసిబిడ్డ మృతి : ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం పై తీవ్ర ఆరోపణలు

Comments are closed.