బీచ్ బ్యూటీగా మెరిసిన నటాషా – బ్రేకప్ తర్వాత న్యూ లైఫ్

Natasa Stankovic Goa beach photos

ప్రసిద్ధ బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్‌ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో విడిపోయిన తర్వాత, ఆమె పేరు సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతోంది. ఈ విడిపోవు అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్య పాండ్యాతో ఎక్కువ సమయం గడుపుతోంది. ఇటీవల విహారయాత్రలలో భాగంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

తాజాగా గోవా బీచ్‌లో సెలవులను ఆస్వాదిస్తూ నటాషా స్టాంకోవిక్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీచ్‌లో తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ, స్విమ్ సూట్‌లో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది. ఫోటోల్లో ఆమె తన కుమారుడితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అగస్త్యకు స్వయంగా ఈత నేర్పుతున్న నటాషా మాతృస్నేహానికి అద్దంపడేలా కనిపించింది.

ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. బ్రేకప్ తర్వాత నటాషా స్వేచ్ఛా జీవనాన్ని ఆస్వాదిస్తూ కొత్త ప్రారంభానికి సిద్ధమవుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం నటి మళ్లీ తన కెరీర్‌ను కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది. టెలివిజన్‌, సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.



One thought on “బీచ్ బ్యూటీగా మెరిసిన నటాషా – బ్రేకప్ తర్వాత న్యూ లైఫ్

Comments are closed.