నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీస్ వాహనంతో రీల్స్ తీయడంపై కలకలం.

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఈగలపెంటలో పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లి, దానిపై రీల్స్ చేసిన యువకులు స్థానికంగా కలకలం సృష్టించారు. రీల్ మోజులో యువకులు పోలీస్ వాహనంలో రౌండ్లు కొట్టిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారిక వాహనాన్ని తగిన అనుమతి లేకుండా ఉపయోగించిన ఈ ఘటనలో, వాహనంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని ఎస్సై బంధువులుగా గుర్తించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సీఐ ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Read More : శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద టోల్ ఉద్యోగిపై వాహనదారుడి దాడి… సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డ్

One thought on “నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీస్ వాహనంతో రీల్స్ తీయడంపై కలకలం.

Comments are closed.