హయత్‌నగర్‌లో విషాదం: గంటల వ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య

హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన దంపతులు నగేష్, శిరీష కుటుంబంలో విషాదం నెలకొంది. నిన్న ఉదయం శిరీష ఆత్మహత్యకు పాల్పడగా, అదే రోజు రాత్రి భర్త నగేష్ కూడా జీవితాన్ని ముగించుకున్నారు.

భార్య శిరీష ఆత్మహత్య ఘటనపై నగేష్‌పై అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జామీనుపై విడుదల చేసిన నగేష్‌ను బంధువులు తీసుకెళ్లారు.

అనంతరం నగేష్ హయత్‌నగర్‌లోని రిలయన్స్ డిజిటల్ షోరూమ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యుల మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Read More : వనపర్తిలో పసిబిడ్డ మృతి : ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం పై తీవ్ర ఆరోపణలు