వక్ఫ్ సవరణ బిల్లుపై పవన్ కల్యాణ్ స్పందన..

వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు కేవలం పార్లమెంటరీ విజయం మాత్రమే కాకుండా, న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనానికి దారితీసే చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. లోక్‌సభలో 12 గంటలు, రాజ్యసభలో 14 గంటలపాటు జరిగిన చర్చల అనంతరం బిల్లు ఆమోదించబడిందని, ప్రతిపక్షాల ఆందోళనలకు సమాధానాలు ఇవ్వడం విశేషమని తెలిపారు.

ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత కోసం నూతన మార్గాలను ఎత్తి చూపిందన్నారు. వక్ఫ్ బోర్డులలో ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం, వక్ఫ్ ప్రయోజనాలను పేద ముస్లింలకు చేరవేయడం ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఎంపీకి, ముస్లిం సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“దేవుని ఆస్తి దోచుకోవడం దేశద్రోహం కంటే ఎక్కువ” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తూ, ఇది దేవునితో ద్రోహం చేసే చర్యగా అభివర్ణించారు. ‘UMEED’ చట్టం నైతిక ప్రమాణాలను ప్రతిబింబిస్తుందంటూ, వక్ఫ్ ఆస్తుల రక్షణ, బోర్డుల బలోపేతానికి ఇది పెద్ద అడుగు అని వివరించారు.

Read More : కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్‌..