స్టార్టప్ మహాకుంభ్‌లో పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై వివాదం..

స్టార్టప్ మహాకుంభ్ 2025లో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారత్‌ స్టార్టప్ వ్యవస్థపై మాట్లాడుతూ, “మనం డెలివరీ బాయ్స్, గాళ్స్‌గా మిగిలిపోవాలా? లేదా దాన్ని మించి ఎదగాలా?” అంటూ చైనా-ఇండియా స్టార్టప్ ల్యాండ్‌స్కేప్‌ను పోల్చుతూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు యువ పారిశ్రామికవేత్తల్లో వివిధ ప్రతిస్పందనలను రేకెత్తించాయి. తాజాగా, ఈ వ్యాఖ్యలపై జెప్టో సీఈవో ఆదిత్ పళిచా స్పందించారు.

X లో చేసిన పోస్ట్‌లో, తన సహవ్యవస్థాపకుడితో కలిసి ప్రారంభించిన జెప్టో కంపెనీ ద్వారా సుమారు 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించామనీ, ప్రతి సంవత్సరం సుమారు రూ. 1,000 కోట్లకు పైగా పన్ను ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని తెలిపారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, డెలివరీ రంగంలో ఉన్న యువతపై అసమ్మతి వ్యక్తమవుతోంది. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు క్లిష్టంగా మారడంతో, కేంద్రం స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్లు కూడ పెరుగుతున్నాయి.

Read More : BIMSTEC summit సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారుతో మోదీ మీటింగ్

One thought on “స్టార్టప్ మహాకుంభ్‌లో పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై వివాదం..

Comments are closed.