Delhi : ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి సాంకేతిక లోపం చోటు చేసుకుంది. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో ప్రయాణం మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పైలట్లు అప్రమత్తమై, వెంటనే పరిస్థితిని సమీక్షించి విమానాన్ని భద్రత పరిరక్షణ దృష్ట్యా తిరిగి హాంకాంగ్‌కు మళ్లించారు.

విమానంలో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదాన్ని నివారించేందుకు పైలట్లు సమయానికి అప్రమత్తమై నిర్ధిష్ట ప్రొటోకాల్ ప్రకారం చర్యలు చేపట్టారు. ప్రస్తుతం విమానాన్ని సాంకేతిక నిపుణులు పరిశీలించి మరమ్మతులు చేపడుతున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలను సంస్థ త్వరలో వెల్లడించనుంది. ఇటీవల ఎయిర్ ఇండియా విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

Read More : సింధు జలాల వినియోగంపై భారత్ కీలక నిర్ణయం

One thought on “Delhi : ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

Comments are closed.