గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న అధికారులు

కృష్ణా జిల్లా ఆత్కూరు భూకబ్జా కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు శనివారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు సంబంధంగా విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గన్నవరం కోర్టు శుక్రవారం వంశీని ఒకరోజు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించిన ఫిర్యాదు మేరకు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా ఉంగుటూరు పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు.

అలాగే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఇప్పటికే విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Read More : టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు..