రెండేళ్ల కృషితో వినూత్న ప్రేమకథ – సాయితేజ్ కొత్త సినిమా లాక్!

Sai Tej new movie

మెగామేనల్లుడు సాయితేజ్ హీరోగా నటిస్తున్న “సంబరాల ఏటిగట్టు” సినిమా ప్రస్తుతం సెట్స్‌పై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. “విరూపాక్ష” తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న సాయితేజ్, ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. సెప్టెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సాయితేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను లాక్ చేసినట్టు సమాచారం. ఓ తమిళ యువ దర్శకుడి కథకు సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కథ వినిపించగానే “ఇది మామూలు ప్రేమకథ కాదు” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

ఇప్పటివరకు భారతీయ తెరపై చూడని వినూత్న ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుంది. దర్శకుడు గత రెండేళ్లుగా ఈ కథను నిబద్ధతతో తయారుచేస్తున్నారని, టైటిల్ కూడా స్టోరీకి సరిగ్గా సరిపోతుందని సాయితేజ్ వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది. “సంబరాల ఏటిగట్టు” పూర్తికాగానే కొత్త ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఏడాది చివర్లో లేదా వచ్చే సమ్మర్‌కి విడుదలయ్యే అవకాశముంది.

“విరూపాక్ష” సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సాయితేజ్, కెరీర్‌లో మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాడు. కథ, కథనం, చిత్రీకరణలో నాణ్యతను మించిన సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అటు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా అన్నయ్యను ఫాలో అవుతున్నాడు. ఫామ్ కోల్పోయిన వైష్ణవ్, హిట్ సినిమాతో మళ్లీ విజయవంతంగా రీఎంట్రీ ఇవ్వాలని కసిగా కథలు వినిపిస్తున్నారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని ముందుకు సాగుతున్నారు.

Read More



One thought on “రెండేళ్ల కృషితో వినూత్న ప్రేమకథ – సాయితేజ్ కొత్త సినిమా లాక్!

Comments are closed.