టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు..

pawan

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం గర్వకారణమని పవన్ కల్యాణ్ అన్నారు.

ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా చేసిన పోస్ట్‌లో, “1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం పార్టీని మాజీ సీఎం, ఎన్టీఆర్‌ స్థాపించారు. అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన టీడీపీ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read More : కర్నూల్‌లో భారీ పెట్టుబడులు.. డ్రోన్ సిటీ అభివృద్ధికి గరుడ ఎయిరోస్పేస్ భారీ ప్రణాళిక!