‘క్రిష్-4’కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. దర్శకుడు రాకేష్ రోషన్ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ, ఎక్కడా రాజీపడకుండా భారీగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో జరిగే ఈ అద్భుత కథలో, ‘కోయి మిల్ గయా’లో మంత్రముగ్ధులను చేసిన జాదూ పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది.
ఇన్నాళ్లూ డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. హృతిక్ రోషన్ ‘క్రిష్-4’కు స్వయంగా దర్శకత్వం వహించనున్నారు. ఆదిత్య చోప్రా, రాకేష్ రోషన్, హృతిక్ రోషన్ కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
సూపర్ హీరో సినిమాకు డైరెక్టర్‌గా మారడం హృతిక్‌కు సవాలే అయినా, క్రిష్ ప్రాంచైజీలోని అనుభవం, తన ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసిన అనుభవం ఆయనకు బలంగా నిలుస్తాయి. ‘క్రిష్-4’ హృతిక్ కెరీర్లో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

One thought on “హృతిక్ రోషన్ సంచలన నిర్ణయం: క్రిష్-4కి దర్శకుడిగా మారిన హీరో”
Comments are closed.