భారీ కుంభకోణంలో బాలీవుడ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే!

Shreyas Talpade Fraud Case

బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ఇటీవల విడుదలైన “పుష్ప 2” చిత్రానికి వాయిస్ ఓవర్ అందించి ఎంతో పాపులారిటీ సంపాదించారు. అయితే శ్రేయాస్ పేరు వివాదాల్లో కూడా తరచుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మోసాల కేసుల్లో ఆయన పేరు అగ్రభాగాన నిలుస్తోంది.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో కోట్లాది రూపాయల చిట్‌ఫండ్ మోసం కేసులో శ్రేయాస్ తల్పాడే పేరు నమోదు కావడం సంచలనంగా మారింది. మహోబా జిల్లాలో దశాబ్ద కాలంగా ఓ చిట్‌ఫండ్ కంపెనీ పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రేయాస్‌తో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది. ఆరోపణల ప్రకారం, అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే కంపెనీ అధిక వడ్డీల మాయ మాటలతో గ్రామస్థులను టార్గెట్ చేసింది.

ఎజెంట్లు స్థానికుల వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, తక్కువ సమయంలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని ఆశ చూపారని తెలుస్తోంది. చట్టపరమైన విచారణలో భాగంగా, మహోబా జిల్లా శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

ఇది శ్రేయాస్ తల్పాడే పేరు ఆర్థిక మోసాల కేసుల్లో ప్రస్తావనకు రావడం తొలిసారి కాదు. ఫిబ్రవరిలో లక్నోలో శ్రేయాస్, ప్రముఖ నటుడు అలోక్ నాథ్‌పై రూ. 9 కోట్ల పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. గోమతినగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అంతకుముందు, హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో జరిగిన బహుళ స్థాయి మార్కెటింగ్ మోసం కేసులో కూడా శ్రేయాస్ తల్పాడే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ వివాదాల నేపథ్యంలో శ్రేయాస్ భవిష్యత్తు ఏమిటో చూడాలి.

Read More


One thought on “భారీ కుంభకోణంలో బాలీవుడ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే!

Comments are closed.