చరణ్‌కు బాబాయ్ విషెస్ – వివాదానికి దారి తీసిన లెటర్‌హెడ్

Pawan Kalyan Wishes Ram Charan Controversy

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల పుట్టినరోజుల వేడుకలు అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన విషెస్ మాత్రం సోషల్ మీడియాలో కొత్త చర్చలకు దారి తీసాయి.

పవన్ కల్యాణ్ అధికారిక ప్రభుత్వ లెటర్‌హెడ్‌పై రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లేఖ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. “అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రామ్ చరణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు” అని పేర్కొన్న ఆ లేఖను మెగా అభిమానులు ఆప్యాయంగా స్వీకరించగా, విమర్శకులు మాత్రం ఈ చర్యను ప్రశ్నిస్తున్నారు.

సర్కార్ లెటర్‌హెడ్‌ను వ్యక్తిగత విషెస్ కోసం ఉపయోగించడం ఎంతవరకు సముచితం? ప్రభుత్వ గుర్తులను సున్నితమైన, అధికారిక అంశాల కోసం మాత్రమే వినియోగించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇది ఆ నిబంధనలకు విరుద్ధమనే విమర్శలు వస్తున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం తెలియకుండా జరిగిపోయి ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు.

ఈ లెటర్‌హెడ్ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ప్రతీకలను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడటం అనైతికమని, ప్రజా ప్రతినిధులు తమ అధికారాన్ని బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పష్టతనిస్తారేమో చూడాలి.

Read More


One thought on “చరణ్‌కు బాబాయ్ విషెస్ – వివాదానికి దారి తీసిన లెటర్‌హెడ్

Comments are closed.