జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ శ్రీలత మధ్య వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఓ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీలత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీలత “దేశంలో పొలిటికల్ పొల్యూషన్ ఎక్కువైంది” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు యువతకు చెడు సంకేతాలు పంపుతాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే అభ్యంతరం
“ఒక బాధ్యతగల అధికారి ఇలా రాజకీయ నేతలా మాట్లాడటం తగదు. మీ పని చేసుకోండి.. రాజకీయ వ్యాఖ్యలు వద్దు” అంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సీరియస్ అంశాన్ని జనరలైజ్ చేయడం ద్వారా యువతకు తప్పుదారి చూపించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు.
ప్రస్తుతం ఈ వివాదం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

One thought on “జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ – అడిషనల్ కలెక్టర్ వివాదం”
Comments are closed.