బిల్ గేట్స్ ప్రశంసలు.. సీఎం చంద్రబాబుతో ఒప్పందంపై స్పందన

chandrababu bill gates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై అపర కుబేరుడు బిల్ గేట్స్ (Bill Gates) స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కలవడం, ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని బిల్ గేట్స్ తెలిపారు.

గేట్స్ ఫౌండేషన్ (Bill & Melinda Gates Foundation India) ద్వారా రాష్ట్రంలో వైద్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో కీలక అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ కొనసాగుతుందని గేట్స్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్‌ను బిల్ గేట్స్ రీట్వీట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More

One thought on “బిల్ గేట్స్ ప్రశంసలు.. సీఎం చంద్రబాబుతో ఒప్పందంపై స్పందన

Comments are closed.