నెట్‌ఫ్లిక్స్‌ బాస్‌లపై అనురాగ్‌ కశ్యప్‌ గట్టిగా ఫైర్!

Anurag Kashyap

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఓటీటీలు నాణ్యమైన కంటెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

అనురాగ్‌ కశ్యప్‌ 2024లో రూపొందించాల్సిన ‘మ్యాక్సిమమ్‌ సిటీ’ వెబ్‌ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా రద్దు చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ బాస్‌లు కేవలం సబ్‌స్క్రిప్షన్ల కోసం నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల స్ట్రీమ్‌ అయిన బ్రిటిష్‌ డ్రామా ‘అడోలెసెన్స్‌’ గురించి మాట్లాడుతూ, భారతీయ ఫిల్మ్‌మేకర్స్‌కు అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.

1.4 బిలియన్ల జనాభా ఉన్న భారత మార్కెట్‌ను టెడ్‌ సరండోస్‌, బెల్లా బజారియా కేవలం వాణిజ్య కోణంలో చూస్తున్నారని అనురాగ్‌ ధ్వజమెత్తారు. ఒరిజినల్‌ కంటెంట్‌ కోసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

అనురాగ్‌ ఇప్పటికే దక్షిణాది సినిమాలకు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. “నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీలు ఈ నిజాన్ని గుర్తిస్తాయా లేదా?” అనే ప్రశ్నను లేవనెత్తారు.

OTT ప్లాట్‌ఫామ్‌లు అనురాగ్‌ వ్యాఖ్యలకు స్పందిస్తాయా? వేచిచూడాలి!

Read More



One thought on “నెట్‌ఫ్లిక్స్‌ బాస్‌లపై అనురాగ్‌ కశ్యప్‌ గట్టిగా ఫైర్!

Comments are closed.