DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై స్ట్రాంగ్ వార్నింగ్

M-Vijay-Kumar_-IPS

డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరిస్తూ.. “బెట్టింగ్ యాప్స్ ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

అలాగే, “ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ విలువలు లేకుండా అసభ్యకరమైన వీడియోలు రూపొందిస్తున్నాడు. తన వీడియోల కోసం చిన్నపిల్లలనూ వాడుకుంటున్నాడు. ఇమ్రాన్ లాంటి వ్యక్తులపై నిఘా పెంచాం. యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

ఇంతేకాదు, బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో చోరీ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితుడు డిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను ఇప్పటికే డిల్లీలో 30కి పైగా ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడని, హైదరాబాద్లో ఇదే అతని తొలి చోరీ యత్నమని తెలిపారు. డీకే అరుణ ఇల్లు అని తెలియకుండానే దొంగతనానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

Read More

One thought on “DCP Vijay Kumar: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై స్ట్రాంగ్ వార్నింగ్

Comments are closed.