హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు మరోసారి సంచలనం రేపుతోంది. ప్రముఖ ఒమేగా హాస్పిటల్ సీఈవో, మహిళా డాక్టర్ చిగురుపాటి నమ్రత డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. షైక్పేట్ ప్రాంతంలోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్‌లో తన నివాసంలో కొకైన్ సేవిస్తుండగా రాయదుర్గం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించగా, నమ్రత ముంబైకు చెందిన డ్రగ్ స్మగ్లర్ వంశ్ టక్కర్ నుంచి కొకైన్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. ఆమె రూ.5 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్‌ను ఆర్డర్ చేసినట్లు సమాచారం.
పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు.
Read More : భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్..

One thought on “రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న రాయదుర్గం పోలీసులు.”
Comments are closed.