తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి తన పాలనను తానే ప్లాప్ అని ఒప్పుకున్నారంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్, “71 వేల కోట్ల రూపాయల రెవెన్యూ తేలేకపోయారనే విషయాన్ని రేవంత్ ఒప్పుకున్నారు. 2014లో రేవంత్ లాంటి వ్యక్తి సీఎం అయ్యి ఉంటే తెలంగాణ వెనక్కి పోయేది,” అని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి కుటుంబాల గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “కుటుంబాలు మాకు లేవా? పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?” అంటూ ప్రశ్నించారు. అలాగే, “రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ప్రజలు ఆయనను తిడుతున్నారంటూ” కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్‌పై అవినీతి ఆరోపణలు
కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ఢిల్లీలో దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెడతానా?” అని ప్రశ్నించారు. గాసిప్స్ చేసి పాలన నుంచి దృష్టి మళ్లించవద్దని హితవుపలికారు. “రేవంత్ రెడ్డి గాసిప్స్‌కు బదులు పాలనపై దృష్టి పెట్టాలి,” అని సూచించారు.
బీజేపీ, ఎంఐఎం అంశంపై స్పందన
బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై స్పందిస్తూ, “రాజాసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించటం లేదు?” అని ప్రశ్నించారు. “రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా?” అని సవాల్ విసిరారు.
రేసింగ్ అంశంపై ఘాటైన వ్యాఖ్యలు
ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణపై విరుచుకుపడిన కేటీఆర్, “ఈ విషయాన్ని తాను వదిలిపెట్టబోనని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ అంశంపై విచారణ జరిపిస్తామని” స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చిన రేవంత్‌కు ఒలంపిక్స్ ఎందుకు కావాలన్న ప్రశ్నలు సంధించారు.

One thought on “KTR విమర్శలు: సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు”
Comments are closed.